పరస్పరం పొగడ్తలు... మోదీ లేకుంటే ఎప్పుడో రాజీనామా చేసుండేవాడిని: దేవెగౌడ

03-05-2018 Thu 11:22 | National
  • త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు
  • మాజీ ప్రధాని దేవెగౌడపై మోదీ ప్రశంసల వర్షం
  • ప్రతిగా ఆయన్నూ పొగిడిన దేవెగౌడ
నిన్న తన బహిరంగ సభ ప్రసంగంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడపై ప్రధాని నరేంద్ర మోదీ పొగడ్తల వర్షం కురిపించిన నేపథ్యంలో, నేడు దేవెగౌడ సైతం అదే పని చేశారు. నరేంద్ర మోదీ పార్లమెంట్ లో లేకుంటే తాను ఎప్పుడో ఎంపీ పదవికి రాజీనామా చేసుండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ వంటి వ్యక్తిని దగ్గరగా చూడటం, మాట్లాడటం కోసమే తాను పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నానని అన్నారు.

గతంలో సొంతంగా బీజేపీకి మెజారిటీ వస్తే రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆయన, తాను ఆ పనికి సిద్ధపడ్డానని, అయితే మోదీలోని నైపుణ్యం, స్పృహ తనను ఆపాయని చెప్పారు. నరేంద్ర మోదీని 'స్మార్ట్ పొలిటీషియన్'గా అభివర్ణించిన ఆయన, కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న విషయమై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మోదీ అని అన్నారు.

ఇక తనను గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజమైనవేనని, రాహుల్ తనను ఎన్నడూ అగౌరవంగా చూడలేదని చెప్పిన దేవెగౌడ, అంతమాత్రాన ఆయనతో తనకు విభేదాలు లేనట్టు కాదని చెప్పారు. రాహుల్ ను కలసి రాష్ట్ర సమస్యలు చెబితే, వాటన్నింటినీ విన్న రాహుల్, సమస్యల పరిష్కారానికి చొరవ చూపేలా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎటువంటి సూచనలూ అందించలేదని ఆరోపించారు.

కాగా, మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా, దేవెగౌడ, కుమారస్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్) కింగ్ మేకర్ అవుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న వేళ, ఆ పరిస్థితే వస్తే కాంగ్రెస్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు ఆ పార్టీతో చేతులు కలిపేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేవెగౌడకు దగ్గరయ్యేందుకు నరేంద్ర మోదీ పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక దేవెగౌడ కుమారుడు, అవకాశం వస్తే సీఎం సీటును అధిష్టించాలని భావిస్తున్న కుమారస్వామి, పైకి తమకు మెజారిటీ వస్తుందని చెబుతున్నా, కాంగ్రెస్ కు అధికారం రారాదని, తాను కింగ్ మేకర్ గా మారాలని కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది.
KarnatakaRahul GandhiNarendra ModiDeve Gowda

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more